తెలంగాణలోని నిరుద్యోగుల కోసం మరో నూతన అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికే పలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ప్రభుత్వం మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నూతన సేవలను తీసుకువచ్చింది. తెలంగాణ సచివాలయంలో ఈ మేరకు తాజాగా సైట్‌ను ప్రారంభించింది. నిరుద్యోగులు ఎక్కడనుండి అయిన వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా www.employment.gov. in అనే వెబ్ సైట్ ను హోం, కార్మిక శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ సచివాలయంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ 9లక్షలకు పైగా మంది నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వివరించారు. ఈ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. టామ్ కామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే విదేశాల్లో ఉపాధి చాన్స్ సంపాదించుకోవచ్చునని వివరించారు. ఈ సైట్ ని నిరుద్యోగులు వాడుకోవాలని కోరారు. ఏ దళారి ని నమ్మకూడదన్నారు.
తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో నిలిచిందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వివరించారు. అప్రెంటిస్ షిప్ కోసం ట్రైనీ ఉద్యోగులకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఆయా కంపెని ఇచ్చే భృతి ఏ కాకుండా కేంద్రం వారిని ప్రోత్సహించాలని వారికి కొంత నిధులు పంపిందని వివరించారు. దానికి తోడుగా అప్రెంటీస్ చేసే వారికి స్టైఫండ్ తరహాలో తెలంగాణ ప్రభుత్వం 1500 రూపాయలు ఇచ్చి వారిని ప్రోత్సాహం ఇస్తోందని మంత్రి నాయిని తెలిపారు.