మాస్ మహారాజు రవితేజ ఒకప్పుడు వరస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేశాడు .ఆ తర్వాత సరైన హిట్ లేక సతమతవుతున్న సమయంలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ మూవీతో మరోసారి టాప్ గేర్ లోకి వచ్చాడు .తాజాగా రవితేజ హీరోగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ ,వల్లభనేని వంశీ నిర్మాతలుగా వస్తున్న లేటెస్ట్ మూవీ టచ్ చేసి చూడు .ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ చిత్రం యూనిట్ విడుదల చేసింది .ఈ మూవీలో రవితేజ సరసన ప్రముఖ హీరోయిన్లు రాశీ ఖన్నా ,శీరత్ కపూర్ నటిస్తుండగా విక్రమ్ సిరి దర్శకత్వం వహిస్తున్నాడు .ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు ..
