దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాగే మీరూ ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాలో పర్యటించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి వైకాపా అధినేత జగన్ మోహన్‌రెడ్డిని కోరారు. కాగా, గురువారం చిత్తూరు జిల్లాలో జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నానని అధికార పార్టీ వారు లేనిపోని మాటలు సృష్టిస్తున్నారని, తాను ఎల్లవేళలా వైఎస్ఆర్సీపీకి తన సేవలు అందిస్తానని చెప్పారు. కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి వెంట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడడ్ఇ, ఎంపీ మిథున్‌రెడ్డి, సమన్వయ కర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తదితరులు ఉన్నారు.
