ఎలాంటి సినీ బ్యాగ్ డ్రాప్‌లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలకు పోని నానిపై ప్రస్తుతం ఓ హీరోయిన్ ఫైర్ అవుతోంది. అతనికోదండం అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. అంతలా ఆ హీరోయిన్‌ను నానిపై కోపం తెచ్చుకోవాడానికి కారణం ఏంటి? అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రధాన చర్చ. అసలు విషయంలోకి వెళితే. న్యాచురాల్ స్టార్ నాని, ఫిధాతో యువకుల మనసు గెలిచిన హీరోయిన్ సాయిపల్లవి కలిసి నటించి తాజా చిత్రం ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి). ఈ చిత్రం ప్రస్తుతం విడుదలై థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. అయితే సినిమాలో సాయిపల్లవి నానిని డామినేట్ చేసేలా తన నటనతో మెప్పించిందట. అయితే చిత్రం ఎడిటింగ్ సమయంలో సాయిపల్లవికి సంబంధించిన కొన్నిసీన్లను కట్ చేయించాడట హీరో నాని. ఇందుకు సంబంధించి నిర్మాత దిల్‌రాజుపై ఒత్తిడి తీసుకొచ్చాడట. తనని డామినేట్ చేసేలా సాయిపల్లవి నటించడంతో నాని ఈ విధంగా చేసినట్లు ఇంస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంసీఏ సినిమా రిలీజ్ అయిన తర్వాత తను నటించి సీన్ల కట్ చేయడాన్ని గమనించిన సాయిపల్లవి బాధపడిందట. ఇలా ఎందుకు చేశారంటూ నిర్మాత, హారోపై కోపగించుకుని, ఇక మీదట నానితో నటించేది లేదంటూ తన సన్నిహితుల వద్ద వాపోయిందని సమాచారం. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న నాని కూడా ఇలా చేశాడా అంటూ ప్రస్తుతం సినీ ప్రేక్షకులు చర్చికుంటున్నారు.
