తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర కానుక ప్రకటించారు. దివ్యాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. ప్రోత్సాహకాన్ని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
