తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర కానుక ప్రకటించనున్నారు .ఇప్పటికే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అర్ధరాత్రి 12 .01 గంటలకు రైతన్నలకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ప్రకటించి వారిజీవితాల్లో వెలుగులు నింపబోతున్న సీఎం కేసీఆర్ కొత్త ఏడాది కానుకగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .
ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వార ముప్పై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను కల్పించిన సర్కారు ట్రాన్స్ కోలో ఒక వెయ్యి ఆరు వందల నాలుగు కొలువుల భర్తీకి నేడు శుక్రవారం ప్రకటన వెలువడునున్నది .
ఇందులో మూడు వందల ముప్పై అసిస్టెంట్ ఇంజనీర్ ,నూట డెబ్బై నాలుగు సబ్ ఇంజనీర్ ,ఒక వెయ్యి వంద జూనియర్ లైన్ మెన్లు పోస్టుల భర్తీకి ట్రాన్స్ కో ప్రకటనను జరిచేయనున్నది.అయితే మూడు వందల ముప్పై పోస్టుల్లో రెండు వందల యాబై ఎలక్ట్రికల్ ,నలబై తొమ్మిది సివిల్ ,ముప్పై ఒక్కటి టెలికాం విభాగాలకు చెందిన పోస్టులు ఉండనున్నాయి ..