కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో బతకాలన్నదే నా ఆకాంక్ష అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గొల్ల, కుర్మ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ఈ రోజు ఘనంగా భూమి జరుపుకున్న సందర్భంలో ప్రతి ఒక్క గొల్ల, కుర్మ సోదరులందరికీ సీఎం కేసీఆర్ శుభాభివందనాలు తెలియజేశారురంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.మన వద్ద సంఘటిత శక్తి లేకనే అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాం. ఆ బాధ పోవాలంటే మనలో ఐకమత్యం రావాలన్నారు.
తెలంగాణ రాష్ర్టానికి రోజుకు 650 లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయని అన్నారు . యాదాద్రి భువనగిరి జిల్లాలో అసెంబ్లీలో సీఎం ఏ విధంగా చెప్పిండో.. ఆ విధంగా.. అద్భుతంగా గొర్రెల పిల్లల పెంపకం జరుగుతుందని వార్తలు చూశాను. ఇతర రాష్ర్టాల నుంచి 35 లక్షలు గొర్రెలు తెస్తే.. వాటికి 13 లక్షల పిల్లలు పుట్టాయి. మొత్తంగా 48 లక్షల గొర్రెలు తెలంగాణలో ఉన్నాయి. దీని ద్వారా కొన్ని వేల కోట్ల సంపదను యాదవులు సృష్టించబోతున్నారు. మూడు, నాలుగు సంవత్సరాలు దాటితే భారతదేశంలో అత్యంత ధనికులైన గొల్ల,కుర్మలు ఎక్కడా ఉన్నారంటే తెలంగాణలో ఉన్నారనే రోజు వస్తుందన్నారు.గొర్రెల యూనిట్ల పంపిణీకి రెండే కొలమానం. ఆయన గొల్ల కావాలి. కుర్మ కావాలి. 18 ఏండ్ల వయసు నిండి ఉండాలి. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి గొర్రెలు ఇవ్వాలని చెప్పాం. ఆ ప్రతిపాదికనే గొర్రెల పంపిణీ జరుగుతుందన్నారు.
సబ్సిడీ గొర్రెలు అమ్ముతున్నారు. పోలీసులు పట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తప్పుడు పని జరగకుండా.. చూడాలి. ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవాలని గొల్ల, కుర్మలకు సీఎం కేసీఆర్ సూచించారు.విదేశాల పర్యటనకు వెళ్లి మాంస ప్రాసెస్ యూనిట్లపై పరిశీలన జరపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సూచించాను. ఆయన త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్తారని అన్నారు . జనవరి 1 నుంచి వ్యవసాయానికి పాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందిస్తామని స్పష్టం చేశారు.ఈజ్ అఫ్ డుయింగ్ లో మనమే మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు.