నాది.. ఒక్కటే ధ్యేయం.. ఒకటే లక్ష్యం అదే ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపడం. మహిళలు, రైతులు, నిరుపేదలను, వృద్ధులను, నిరుద్యోగులను కలుసుకుని వారికి ధైర్యం చెప్పడం. ఈ మాటలు ఎవరో అన్నవి కావు. స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలే. కాగా, ప్రజల సమస్యల పరిష్కారమార్గన్వేషణలో భాగంగా నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం (45వ రోజు)వరకు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తన పాదయాత్రను కొనసాగించిన వైఎస్ జగన్.. గురువారం (46వ రోజు) చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ఎదుద్లవారి కోట గ్రామంలోకి ప్రవేశించింది.
ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి జగన్‌ను ఆశీర్వదించారు. చిత్తూరు జిల్లాలో మొదటి రోజు ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా.. భారీ సంఖ్యలో జన సందోహం కనిపించింది. పాదయాత్రలో భాగంగా తనవెంట నడించేందుకు వచ్చిన జనంతో కలిసిన జగన్ ఎద్దులవారి కోట,ఎద్దువల వేమన్నగారిపల్లి, ఆర్ఎన్ తండా, కొట్టాల క్రాస్ మీదుగా వసంతపురం వరకు యాత్ర కొనసాగించారు వైఎస్ జగన్.