ఏపీలో రాజకీయం వెడెక్కుతుంది. ఒక ప్రతి పక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజల్లో మార్పు తేస్తున్నాడని, టీడీపీ నేతల్లో గుండెల్లో గుబులు మొదలైందని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక వైపు వందల కొట్లు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు తన ఎమ్మెల్యేలను మాత్రం అవమానిస్తున్నాడని టీడీపీ నేతలు అంటున్నారు. తాజాగా తనకు జరిగిన అవమానానికి డిప్యూటీ సిఎం రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. పోలీసు శాఖకు సంబంధించిన ఫొరెన్సిక్ ల్యాబ్‌కు శంకుస్థాపన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిన తీరుపై ,తనకు జరిగిన అవమానానికి అలిగి, ఆ కార్యక్రమాన్ని బహిష్కరించడమే కాకుండా గౌరవం లేని పదవిలో ఎందుకు ఉండడమనే బాధతో రాజీనామా చేసే వరకు వెళ్లినట్లు సమాచారం.
ఆ కార్యక్రమం ముందుగానే ఖరారైనప్పటికీ సంబంధిత హోం శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు ప్రభుత్వ శాఖ నుంచి లేదా డీజీపీ కార్యాలయం నుంచి కాకుండా ఒక సాధారణ కానిస్టేబుల్ ద్వారా పోలీసు శాఖ నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కార్యక్రమానికి వెళ్లకుండా తిరుపతికి.. చంద్రబాబు వస్తారని తెలిసి కూడా కార్యక్రమానికి వెళ్లకుండా చిన రాజప్ప తిరుపతికి వెళ్లిపోయారు. దానికి ముందే ఆయన తన పదవికి రాజీనామా చేయడానికీ సిద్ధపడినట్లు సమాచారం. తాను రాజీనామా చేయాలని అనుకుంటున్న విషయాన్ని చినరాజప్ప స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఆయనను వారించి తాను పోలీసులతో మాట్లాడతానని బుజ్జగించినట్లు తెలుస్తోంది.