ఇండియా టెలికాం రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన జియోకు పోటిగా ప్రముఖ టెలికాం దిగ్గజం అయిన ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రవేశపెట్టింది .జియో కేవలం తొంబై తొమ్మిది రూపాయల రీచార్జ్ తో పద్నాలుగు రోజుల వ్యాలిడిటీతో 2.1 జీబీ డేటా ఆఫర్ ను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .తాజాగా ఎయిర్టెల్ జియోకి ధీటుగా ఐదు రూపాయలు తగ్గించి కేవలం తొంబై మూడు రూపాయలకే రీచార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.దీని ద్వారా పది రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటాను అందజేస్తుంది.అయితే జియో మాదిరిగా రోజుకి 0.15జీబీ మాత్రమే వాడుకోవాలన్న జియో నిబంధనను ఎయిర్టెల్ విధించలేదు .ఎయిర్టెల్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ తో పాటుగా డైలీ వంద ఎస్ఎంఎస్ లను అందజేస్తుంది .
