ఏపీలోని నెల్లూరు జిల్లా సాలుచింతలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాలుచింతలో గురువారం అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. దీంతో పట్టాలు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేతలు చేస్తున్న అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని ఆయన ఘటనాస్థలిలో బైఠాయించారు. దీంతో పోలీసులు అడ్డుకుని అనిల్ కుమార్ తో పాటు పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేశారు. న్యాయం కోసం ఆందోళన చేపడుతున్న నేతలను అరెస్టు చేయడం అన్యాయమని స్థానికులు మండిపడుతున్నారు.దీంతో ఆ ప్రాంతమంత తీవ్ర తీవ్ర ఉద్రిక్తతగా మారింది. భారిగా పోలీసులు మొహరించారు.
