ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో 46వ రోజు ముగిసింది. నేటి(గురువారం) ఉదయం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోనికి పాదయాత్ర ప్రవేశించింది. అనంతపురం జిల్లా బలిజపల్లి శివారు నుంచి నేటి యాత్రను ప్రారంభించిన జగన్ తంబళ్లపల్లి మండలం ఎద్దులవారికోట గ్రామం నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. ఈరోజుతో వైఎస్ జగన్ పాదయాత్ర 46 రోజులు పూర్తిచేసుకుంది. నేడు ఆయన 8.7కిలోమీటర్లు నడిచారు. ఈరోజు వరకు వైఎస్ జగన్ మొత్తం 644.1 కిలోమీటర్లు నడిచారు కాసేపటి క్రితం ఆయన పాదయాత్రకు విరామం ఇచ్చారు. దీంతో అక్కడి నుంచి జగన్ నేరుగా బెంగళూరుకు బయల్దేరారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకోనున్నారు. రేపు (శుక్రవారం) సీబీఐ కోర్టు విచారణకు ఆయన హాజరుకానున్నారు.