ప‌్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ( గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ ) GES ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నడి ఒడ్డున హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఈ సదస్సు కు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్‌హౌస్ ముఖ్య సలహాదారు ఇవాంకా ట్రంప్ , ప్రధాని మోదీ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు.ఈ సదస్సు మొత్తం మూడు రోజులు జరిగింది.ఈ సదస్సులో మొత్తం 150 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. అయితే తొలిసారిగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఇవాంకా కు ఘన స్వాగతం లభించింది. GES సదస్సు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీతో ఇవాంకా ప్రత్యేక బేటీ అయ్యారు.తరువాత సదస్సులో పాల్గొని మాట్లడారు..ఈ సదస్సు అనంతరం రాత్రి హైదరాబాద్ నగరంలోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ లో డిన్నర్ చేసారు.. ప్రభుత్వం ఇచ్చిన ఈ విందుకు ఇవాంకా ఫిదా అయ్యారు.
రెండో రోజు GES సదస్సులో భాగంగా ప్లీనరీ జరిగింది. ఈ ప్లీనరీకి మంత్రి కేటీఆర్ మాడరేటర్‌గా వ్యవహరించారు.అయితే ఈ సదస్సు అయిపోయిన తరువాత అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుపై ఇవాంకా ఒక ట్వీట్ చేసారు. సదస్సు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ,అద్భుతమైన ఆహ్వానం ఇచ్చిన ప్రధాని మోదీ, భారత దేశ ప్రజలకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేసారు.హైదరాబాద్ పర్యటనలో భాగంగా గోల్కండ కోటను ఆమె సందర్శించారు. కోట చరిత్ర, గోప్పతన్నాని అడిగి మరి తెలుసుకున్నారు.కోట అందాలను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె ట్వీట్ చేసారు.కోటను చుసిన తరువాత ఇవాంకా అమెరిక బయలుదేరి వెళ్ళారు.మొత్తానికి ఇవాంకా హైదరాబాద్ పర్యటనలకు వచ్చి ఫుల్ ఫిదా అయ్యారు