అవును మీరు చదివింది నిజమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ మళ్లీ కలవనున్నారు. అయితే, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. ఇప్పటికే 99 శాతం చిత్ర షూటింగ్‌తోపాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మిగతా 1 శాతం పనులను పూర్తిచేసే పనిలో ఉన్నారు అజ్ఞాతవాసి చిత్ర బృందం. అంతేగాక, పవన్ కల్యాణ్‌చే ప్రత్యేకంగా పాడించిన పాట కూడా ఈ నెల 31వ తేదీన పవర్ స్టార్ అభిమానులను అలరించనుంది. అజ్ఞాతవాసి అని వర్కింగ్ టైటిల్‌గా మొదలుపెట్టి.. చివరకు ఆ పేరును పవన్ సినిమాకు ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇదే టైటిల్ విడాకులు తీసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను, రేణుదేశాయ్‌ను మళ్లీ కలపనుందనే గుసగుసలు టాలీవుడ్‌లో వినిపనిస్తున్నాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. అజ్ఞాతవాసి అన్న పదం వినగానే.. పురాణాలు తెలిసిన ప్రతీ ఒక్కరికి వెంటనే గుర్తొచ్చేది పాండవుల అంశం. పాండవులు ఒకానొక సమయం తమ కుటంబం కోసం అజ్ఞాతవాసం చేసిన విషయం తెలిసిందే. నాటి పాండవుల సీన్‌ను ప్రస్తుతం పవన్‌కు ఆపాదిస్తూ చర్చలు కొనసాగుతున్నాయి టాలీవుడ్‌లో. అజ్ఞాతవాసి చిత్రంలోనూ పవన్ పాత్ర అలానే ఉంటుందంట. అంతేగాక, తన కుటుంబం కోసమే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రేణుదేశాయ్‌ను వదిలేయగా.. ఇప్పుడు అదే కుటుంబం కోసం రేణుదేశాయ్‌తో కలవనున్నాడట.
ఇక్కడ మరో విశేషమేమిటంటే.. పవర్ స్టార్, త్రివిక్రమ్ కాంబోలు వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు అదే కాంబోలో వస్తున్న అజ్ఞాతవాసిలో కూడా మొదట అక్షరం అ ఉండటంతో.. ఈ చిత్రం కూడా టాలీవుడ్ గత చిత్రాల రికార్డులన్ని తుడిపేయడంతోపాటు.. తెలుగు తెరపై చరిత్ర సృష్టిందని అంటున్నారు సినీ జనాలు.