బతుకమ్మ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఎవరు చేయని విధంగా తీరొక్క రంగుల పూలన్నిటిని పేర్చి ఆడబిడ్డలు కొత్త కొత్త బట్టలను ధరించి పూజించే అతి పెద్ద పండుగ .ఒకప్పుడు బతుకమ్మ పండగను వలస పాలకులు నిర్లక్ష్యం చేస్తే కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా సర్కారు బతుకమ్మ పండుగకి కొంత నిధులు కేటాయించి మరి రాష్ట్ర పండుగగా గుర్తించి ఎన్నడు లేని విధంగా బతుకమ్మ పండుగక్కి గుర్తింపును తెచ్చింది .
ఈ ఏడాది జరిగిన బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో దాదాపు ముప్పై ఐదు వేలమంది మహిళలతో సంబరాలు అంబరాన్ని అంటాయి .తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అధ్వర్యంలో జరిగిన ఈ మహావేడుకకి రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు హాజరయ్యారు .ఒక్క మన దేశంలోనే దాదాపు పదిహేను రాష్ట్రాల నుండి బ్రహ్మకుమారిలు తరలివచ్చి మహాబతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు .
ఈ మహావేడుకల్లో పాల్గొన్న పంతొమ్మిది రాష్ట్రాలకు చెందిన కళాకారులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి .మహిళలు బతుకమ్మ పాటలు పడుతూ బొడ్డెమ్మ ఆడారు .ముప్పై ఐదు వేలమంది మహిళలు పాల్గొన్న ఈ మహావేడుక కారణంగా ఎల్బీ స్టేడియం రంగు రంగుల పూలవనంగా మారింది .రాష్ట్రంలో ఉన్న ముప్పై ఒక్కటి జిల్లాల నుండి మహిళలు ,యువతులు భారీగా తరలి వచ్చారు .31 జిల్లాల నుంచి తరలివచ్చిన మహిళలు వలయాకారంలో లయబద్దంగా బతుకమ్మఆడుతూ ఉయ్యాల పాటలతో ఎల్బీ స్టేడియం మార్మోగింది. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి వైభవానికి ప్రతీకగా మహాబతుకమ్మ నిలిచింది.