2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన భూమా నాగిరెడ్డి ఆ తర్వాత పరిణామాల్లో టిడిపిలో చేరారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే భూమా మరణించడంతో ఆ కుటుంబం నుండి బ్రహ్మనందరెడ్డి బరిలోకి దిగాడు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నిక అధికార టిడిపికి, విపక్ష వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరడంతో హాట్ హాట్ గా రాజకీయలు మారాయి. ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే నంద్యాలలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార,విపక్ష పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేశాయి. నంద్యాల స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో గెలుపుకోసం రెండు పార్టీలు హల్ చల్ చేశాయి. నంద్యాల ఉప ఎన్నికలు అధికార టిడిపి, విపక్ష వైసీపీలకు అగ్నిపరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ విజయం సాధిస్తే సమరోత్సాహంతో 2019 ఎన్నికల్లో పనిచేయనుంది. ఒకవేళ వైసీపీ గెలిస్తే సార్వత్రిక ఎన్నికలు టిడిపికి అగ్నిపరీక్ష అని అనుకున్నారు.
టీడీపీ గెలుపు కోసం టీడీపీ నేతలు ఒక్కోచోట ఒక్కో రేటు
అదికార పార్టీ గెలుపు కోసం టీడీపీ నేతలు ఒక్కోచోట ఒక్కో రేటు కట్టి పంచడం ప్రారంభించారు. ఒక చోట ఓటుకు రూ.2 వేలు, మరో చోట రూ.3, రూ.5 వేలు ఇచ్చారు. కొన్ని చోట్లయితే ఏకంగా రూ.10 వేల వరకూ పంచుతున్నారు.ఉదయం పూట ఒక రేటు, రాత్రి సమయాల్లో మాట్లాడితే మరో రేటు అనే మొబైల్ కంపెనీల ఆఫర్ల తరహాలో అధికార పార్టీ కూడా ఓటర్లకు ఆఫర్లు ప్రకటించింది. మరి కొన్ని వార్డుల్లో రూ.2, 3, 5 వేలు పంచుతూ పట్టుపడ్డారు తెలుగుదేశం నేతలు.
ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కారు. బనగానపల్లె కేంద్రంగా మద్యం, డబ్బులు పంపిణీ చేశారు. మంత్రులు అమర్‌నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో బసచేశారు. ఇతర జిల్లాల నేతలు కర్నూలు విడిచి వెళ్లాలని ఎన్నికల సంఘం ఆదేశించినా లెక్కచేయలేదు.మరికొంత టీడీపీ నాయకులు ఆళ్లగడ్డలో తిష్టవేశారు.
చిక్కిన టీడీపీ దొంగ ఓటర్లు:
ఉదయం నుంచి కొనసాగుతున్న టీడీపీ అక్రమపర్వం పరాకాష్టకు చేరింది. ఏకంగా భారీ సంఖ్యలో దొంగ ఓటర్లను రంగంలోకి దించింది. నంద్యాలలోని నందమూరి నగర్‌లో 10 మంది టీడీపీ దొంగ ఓటర్లను ఎన్నికల పరిశీలకులు పట్టుకున్నారు. విచారణ కోసం వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 10 మంది దొరికిపోవడంతో మరో 20 మంది ఓటర్లు పోలింగ్ స్టేషన్ నుంచి పారిపోయారు.
ఉప ఎన్నికకు పోలింగ్…
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 79.20 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 2,18,858 ఓట్లు ఉండగా, 1,73,335 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో పురుషుల ఓట్లు 84,831, మహిళల ఓట్లు 88,503. 2009లో 76 శాతం పోలింగ్ నమోదైంది.
ఓట్ల లెక్కింపు 28వ తేదీ..
నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ నెల 28వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభ అయ్యింది. నంద్యాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యే సమయానికి 247 ఓట్లు పోలింగ్ సెంటర్ కు పంపలేదు.దీంతో వాటిని చెల్లనివిగా పరిగణించారు. టైంలో వచ్చిన వచ్చిన మూడు ఓట్లు కూడా చెల్లనివే కావడంతో మొత్తం 250 పోస్టల్ బ్యాలెట్ ఓట్లనూ చెల్లనివిగా ప్రకటించారు ఎన్నకల అధికారులు.
టీడీపీ విజయం…
నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారు. మొత్తం 27,296 ఓట్లతో ఆయన గెలుపొందారు. బ్రహ్మానందరెడ్డి మొత్తం 97,106 ఓట్లను సొంతం చేసుకున్నారు. వైసీపీపార్టీకి 69,810 ఓట్లను సాధించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 1,153 ఓట్లను సాధించారు.
2017లో ఈ ఉప ఎన్నిక హోరా హోరాగా ముగిసింది నంద్యాల ఉప ఎన్నిక…ఇది దేశంలోనే పెద్ద సంచలనం..