తెలంగాణ రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లలో పర్యటించారు..ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని పేరుపల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్లను మంత్రి తుమ్మల ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివ్రద్ది పనులను చూసైన రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కళ్లు తెరవాలని అన్నారు.
ఇల్లు లేని పేదలకు పక్కా ఇండ్లు ప్రభుత్వమే ఉచితంగా కట్టించి ఇవ్వడం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదని, కొన్ని రాజకీయ పార్టీలు పేదలకు ఇండ్లు ఇచ్చే అంశాన్ని కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూడటం సరికాదన్నారు.గ్రామాల్లోని అర్హులందరికీ దశల వారీగా డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అరవై ఏళ్లలో ఏనాడు జరగని అభివృద్ధిని మూడున్నరేళ్ళలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు.ఈ సభలో వైరా ఎమ్మెల్యేబాణోత్ మదన్‌లాల్, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు.