#askktr హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ లైవ్‌లో ఉన్న సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను పలువురు హాట్ హాట్ ప్రశ్నలు అడిగారు. ఇంకొందరు చిలిపి సమాధానాలు కూడా అడిగి తెలుసుకున్నారు. మరికొందరు భవిష్యత్ రాజకీయాలను జోస్యం చెప్పారు. అయితే అన్నింటికీ….మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కూల్‌గా రిప్లై ఇవ్వడం గమనార్హం.
వచ్చే ఎన్నికల్లో విజయం మీదే అంటూ ఆంధ్ర నెటిజన్ చేసిన కామెంటుకు ఎన్నికల గురించి వర్రీ లేదని మంత్రి కేటీఆర్ ఒక్క మాటలో తేల్చేశారు. టీఆర్ఎస్‌ను అంధ్రలో విస్తరించే అలోచనలేవీ తనకు తెలియవన్నారు. అంధ్రప్రదేశ్ తమ సోదర రాష్ర్టమని పేర్కొంటూ తనకు అక్కడ ఓటు లేనందున ఎవరికి ఓటు వేస్తారనే ప్రశ్న ఉత్పన్నం కాబోదని మంత్రి చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ప్రజలే పవన్ కల్యాణ్ రాజకీయ జీవితాన్ని నిర్ణయిస్తారన్నారు. మంత్రి హరీష్ రావు గురించి అడిగితే మెండి పట్టుదల కలిగిన హార్ఢ్ వర్కింగ్ నాయకుడని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.
కేంద్ర కెబినెట్లో చేరుతారా అని ప్రశ్నించగా…ఉన్నదాంతోనే సంతోషంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని మార్గాల్లో ప్రయత్నించిన తర్వాతే పార్లమెంటులో తమ ఎంపీలు నిరసన తెలిపారన్నారు. రాజకీయాల్లో ఒకటి ఒకటి రెండు ఏన్నటికీ కాదన్నారు. మెట్రో రైల్ ప్రారంభం, గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ రెండూ ఒక్క రోజు ఉండడమే ఈ ఏడాది గుర్తిండిపోయే రోజని మంత్రి కేటీఆర్ అన్నారు. జీఈఎస్ సదస్సులో చర్చను నిర్వహించిన సందర్భంగా నెర్వస్ గా ఫీల్ అయిన్నట్లు మంత్రి తెలిపారు.
సినిమా నటుల గురించి పలువురు నెటిజన్లు ప్రస్తావించగా…అల్లు అర్జున్ గురించి చెప్పమంటే ఏనర్జీ, స్టైల్, స్వాగ్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. మహేష్ బాబు సూపర్ స్టార్, ప్రభాస్ బాహుబలి, జూనియర్ ఎన్జీయార్ ఒక ఫార్మమర్, సచిన్ ఒక లెజెండ్, పవన్ కల్యాన్ ఒక ఏనిగ్మా అని అన్నారు. తాను దేవున్ని కాకుండా కర్మను నమ్ముతాన్నారు. ఫిట్ గా ఉండడమే కొత్త సంవత్సర తీర్మానమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇండియన్ చైనీస్ తనకు ఇష్టమైన అహారం అని తెలిపారు. అమెరికాలో ఉన్నప్పుడు వంట చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాట చెప్పమంటే అయన ఏవరు అని ప్రశ్నించారు.