తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ టాస్క్ మాస్టర్ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ట్విట్టర్ లైవ్‌లో ఆయన స్పందిస్తూ…ముఖ్యమంత్రి గురించి ఒక్కమాటలో చెప్పమంటే సానూకూల ఫలితాలు సాధించే టాస్క్ మాస్టర్ అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నారని వెల్లడించారు.
వవసాయ రంగాన్ని అభివృద్ది చేసేందుకే ఏకరాకు 4వేల సబ్సీడీ , రైతు సంఘాలు, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 24 గంటల కరెంటు వలన భూగర్జ జలాలు సమస్య ఏర్పడకుండా అటో స్టార్టర్లను తొలగించాలన్నారు. త్వరలోనే లక్ష ఉద్యోగాల భర్తీ పూర్తవుతుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తనకు నచ్చిన గొప్ప రాజకీయ నాయకుడు అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావడం లేదేందుకు అంటే ప్రభుత్వం, ప్రజలు వేరు అనే భావన ఉన్నదని, నిజానికి రెండు కలిస్తేనే ప్రజాసామ్యమని మంత్రి కేటీఆర్ అన్నారు.దేశంలో రెండు పార్టీల వ్యవస్ధ మాత్రమే లేదని మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు.కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీనా అనే ప్రశ్నకు సమాధానంగా సోనియా రిటైరైన విషయాన్ని గుర్తు చేశారు.