ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్‌ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్‌జగన్‌కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు పింఛన్ రావడం లేదని, ఇలా వారి వారి సమస్యలను జగన్‌కు అర్జీల రూపంలో తెలుపుతున్నారు ప్రజలు.
అయితే, వైఎస్ జగన్ ఓ వైపు తన ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తూనే.. మరో వైపు ప్రస్తుత రాజకీయ అంశాలను నిశితంగా పరిశీలిస్తూ.. తాజా పరిణామాలపై వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తీసుకున్న నిర్ణయమే కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పోటీ నుంచి తప్పుకోవడం. దీనికి కారణం వైసీపీ గత అనుభవాలే. అయితే, గతంలో చంద్రబాబు సర్కార్ ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటర్లను డబ్బు మూటలను చూపి కొనుగోలు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలోనే మళ్లీ చంద్రబాబు తన డబ్బు మూటల ఆకర్షను తెరపైకి తెచ్చే అవకాశం ఉండటంతో.. ముందుగానే గమనించిన జగన్ కేడర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని ప్రకటించింది. వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు డబ్బు మూటలతో టీడీపీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే.