ఫిదా సినిమా అనగానే గుర్తుకొచ్చేది సాయి పల్లవి.. హ్యాపీడేస్ తదితర సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకొన్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఫిదా.ముప్పై ఏండ్లలో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది ఫిదానే.తెలంగాణ యాసలోని సౌందర్యాన్ని, ఆత్మని.. భాషలో ఉన్న మట్టి పరిమళాన్ని చూపించి యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సాధారణంగా తెలుగు సినిమాల్లో పల్లెటూరు వాతావరణం అనగానే కోనసీమ, గోదావరి తీర ప్రాంతాలను చూపిస్తుంటారు. ఆ మూసధోరణికి భిన్నంగా తెలంగాణ పల్లెల్లో ఉండే అనురాగాల్ని, ఆప్యాయతల్ని, ప్రకృతి రమణీయతను సర్వజనరంజకంగా ఫిదా చిత్రంలో చూపించారు.ఫిదా సినిమా లో ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి తన పెర్ఫార్మెన్స్ తో థియేటర్ లో అందరిని కట్టిపడేసింది. ప్రతి చిన్న ఎమోషన్స్ కి కూడా అద్బుతంగా చూపిస్తూనే, కుటుంబం, ప్రేమ అనే బంధాల మధ్య నలిగిపోయే ఓ మామూలు అమ్మాయి పాత్రలో ఆ సంఘర్షణని భాగా చూపించింది. ఈ సినిమా కేవలం విడుదలైన 14 రోజుల్లోనే 34 కోట్ల షేర్.. 61 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. శేఖర్ కమ్ముల సినిమాలకు ఇలాంటి కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి.కథాపరంగా ఇది రొటీన్ స్టోరీనే అయినా తెరకెక్కించిన విధానంలో ప్రేక్షకులను ఫిదా చేస్తారు.