ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .గతంలో ఆయన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను వేసిన రోడ్ల మీద నడుస్తారు .నేనిచ్చే పెన్షన్ తీసుకుంటారు .తమ ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలను పొందుతారు .
అందుకే నాకు ఓట్లు వేయాలి అని అన్నారు .అప్పుడు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి .తాజాగా ఆయన ఏపీ ప్రజలను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు .రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతిలో ఏపీ ఫోరెన్సిక్ లేబొరేటరీకి చంద్రబాబు గురువారం శంఖుస్థాపన చేశారు .ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయాన్ని పరిరక్షించే పోలీసు వ్యవస్థ ,ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటె అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి .
పవర్ సెక్టార్ లో గతంలో నేను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాను .కానీ ఉమ్మడి రాష్ట్రంలో 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాకు అధికారం లేకుండా చేశారు అని ఏపీ ప్రజలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు .అప్పటి ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టిన సంగతి తెల్సిందే .దీంతో చంద్రబాబు తొమ్మిది యేండ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నారు చంద్రబాబు .