ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో నేటితో ఆయన దిగ్విజయంగా ప్రజాసంకల్ప యాత్రను పూర్తిచేసుకున్నారు .
ఈ సందర్భంగా జగన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించారు .రాష్ట్రంలో దశల వారిగా మద్యపానాన్ని నిషేదిస్తాం అని తెలిపారు .అంతే కాకుండా రైతన్నలకు ప్రతి ఏడాది మే నెలలోనే పన్నెండు వేల ఐదు వందల రూపాయలను చేల్లిస్తామని అన్నారు .
అంతే కాకుండా పంట చేతికి రాకముందే గిట్టుబాటు ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది .ఎన్నికల నాటికీ డ్వాక్రా మహిళలకు ఎంత అప్పు ఉంటె అంత నాలుగు విడతల్లో నగదు రూపంలో చెల్లిస్తామని ..ప్రతి జర్నలిస్టుకు ఖచ్చితంగా ఇళ్ళ స్థలం ఇస్తాం అని ఆయన మీడియాకు తెలిపారు .