రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ఆరుదైన ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఫోరం నిర్వాహాకులు కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. 48వ వరల్డ్ ఎకనమిక్ సమావేశాలు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పట్టణంలో రెండు రోజులపాటు(జనవరి 18, 19వ తేదీలు) జరగనున్నాయి. సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెయ్యి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, ఎంపిక చేసిన రాజకీయ నాయకులు, అకాడమీషియన్లు, ఎన్జీవో ప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలు, మీడియా ప్రముఖులు పాల్గొంటారు.కేంద్రమంత్రులు, రాష్ర్టాల అధినేతలకు మాత్రమే ఇప్పటి వరకు వరల్డ్ ఎకనమిక్ సదస్సు ఆహ్వానాలు అందాయి. కాగా మొదటిసారిగా ఒక రాష్ట్రమంత్రికి వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానం పలికింది. సదస్సులో పాల్గొనే అవకాశం రావటంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.