ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్‌ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్‌జగన్‌కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు పింఛన్ రావడం లేదని, ఇలా వారి వారి సమస్యలను జగన్‌కు అర్జీల రూపంలో తెలుపుతున్నారు ప్రజలు.
అయితే, నిన్న అనంతపురం జిల్లాలో కొనసాగిన జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా మీడియాతో ముచ్చటించారు. అదే సందర్భంలో తాను పాదయాత్ర చేసే సమయంలో ప్రకటించిన 45 ఏళ్లకే పింఛన్ అన్న అంశంపై వివరణ కూడా ఇచ్చారు. ధర్మవరంలో తాను పాదయాత్ర చేయక ( వారం రోజుల ) ముందు 35 రోజులుగా అక్కడ చేనేతలు నిరాహారదీక్ష చేశారని, అందులోనూ 35 మంది పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. ఆ నిరాహారదీఆక్షలు చేస్తున్న శిబిరంలో పాల్గొన్న వారంతా మహిళలే. 35 మంది చనిపోయినా చంద్రబాబు సర్కార్‌కు చలనం లేదు. అటువైపుగా కనీసం మంత్రులు కూడా రాని పరిస్థితి. ఆ సమయంలో నేను వెళ్లి వారిని విచారించగా.. అసలు పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా.. వారు చెప్పిన సమాధానలతో తన హృదయం చలించి పోయిందన్నారు జగన్.
బతకడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నా..
కడుపు నిండా తినే పరిస్థితి లేదన్నా..
ప్రతి రోజు పస్తులుండాల్సిన పరిస్థితి అన్నా..
35 రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నా.. 35 మంది ఆత్మహత్య చేసుకున్న పట్టించుకునే నాథుడే లేరన్నా..
అంటూ వారు చెప్పిన సమాధానం తనను కలిచివేసిందన్నారు. అప్పుడు తాను 45 ఏళ్లకే పింఛన్ అన్న నిర్ణయం తీసుకున్నానని తెలిపారు జగన్. ఈ విషయం తెలిసిన అధికార పార్టీ వారు కనీసం వారిని ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, 45 ఏళ్లకే పెన్షన్ అనే అంశానికి వైఎస్ఆర్ చేయూత అన్న పేరును నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. అది ఒక ఎమోషనల్ నిర్ణయమంటూ చెప్పారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.