ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గురజాల అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇంట్లో విషాదం నెలకొన్నది .ఆయనకు పితృవియోగం జరిగింది .ఎమ్మెల్యే శ్రీనివాసరావు తండ్రి యరపతినేని లక్ష్మయ్య ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ ఆస్పత్రిలో మరణించారు .గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే తండ్రిని తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు .అయితే ఈ రోజు సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు .ఆయన అంత్యక్రియలు ఎమ్మెల్యే స్వగ్రామంలో జరుగుతాయి అని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు .