తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వేల నూట ఇరవై ఏడు మంది ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటిచేసిన అభ్యర్ధులు చేసే వ్యయ వివరాలు ప్రకటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్ తెలిపింది .
ఇలా వేటు పడినవారు పంచాయితీ రాజ్ చట్టంలో నియమాలు ప్రకారం దాదాపు మూడు యేండ్లపాటు ప్రత్యేక్ష ఎన్నికలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది .దీంతో గ్రామ పంచాయితీలతో పాటుగా జెడ్పీటీసీ,ఎంపీటీసీ ,ఎంపీపీ ,జెడ్పీ ఎన్నికలకు అనర్హవులతారు.రాష్ట్రంలో తమ ఎన్నికల ఖర్చులను వెల్లడించని రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది గ్రామపంచాయితీ అభ్యర్ధులపై వేటు వేస్తున్నట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది .
అంతే కాకుండా జెడ్పీటీసీ ,ఎంపీటీసీ సభ్యులుగా పోటిచేసిన ఒక వెయ్యి నూట ఎనబై తొమ్మిది మందిపై ,మున్సిపల్ ఎన్నికల్లో పోటిచేసిన రెండు వేల పన్నెండు మందిపై మొత్తం ఆరు వేల నూట ఇరవై ఏడు మందిపై అనర్హత వేటు వేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది .ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం 2020 నవంబర్ 24వ తేది వరకు ఎన్నికల్లో వీరు పోటికి అనర్హులు ..