గత కొన్ని రోజులుగా బాగ్యనగరంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హోటళ్లు…లాడ్జింగ్ లు, అపార్ట్ మెంట్స్ లో ఇల్లు అద్దెకు తీసుకొని ఇలా చాల విదాలుగా విచ్చలవిడిగా హైదరాబాద్ లో వ్యభిచారం జరుగుతున్నది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు కొంత సమచారం కునుగొన్నట్లు తెలుస్తుంది. నగర శివార్లలోని కొత్తకాలనీల్లోని ఇళ్లను అద్దెకు తీసుకొని వాటి కేంద్రాలుగా సెక్స్ రాకెట్ బాగోతం నడుపుతున్నారని రాచకొండ పోలీసుల కనుగొన్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్, బాలాపూర్ ప్రాంతాల్లోని కొత్త కాలనీలే అడ్డాలుగా మార్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని రాచకొండ ప్రత్యేక పోలీసుల దాడుల్లో తేలింది.
బాలాపూర్ ప్రాంతంలో ఓ వ్యభిచార గృహంలో 9 మంది మహిళలుండగా పోలీసులు దాడి చేసి వారిని మహిళా సదనానికి తరలించారు. కొత్త కాలనీలో నిర్మించిన గృహాలను అద్దెకు తీసుకొని నిర్వాహకులు గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని రాచకొండ అదనపు డీసీపీ రఫీఖ్ చెప్పారు. రాజేంద్రనగర్ లోని రెండు అపార్టుమెంట్లలో ఈ రాకెట్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి ఓ మైనర్ బాలికకు విముక్తి కల్పించారు. నగర శివారు ప్రాంతాల్లోని కాలనీలు కేంద్రాలుగా సాగుతున్న ఈ చీకటి బాగోతంపై పోలీసులు దృష్టి సారించి దాడులు కొనసాగిస్తున్నారు. ఇంకా నగరంలో జరుగుతున్న ఆ వ్యభిచారన్ని పూర్తిగ తగ్గిస్తామని పోలీసులు అంటున్నారు.