‘కడప’ పేరుతో రాయలసీమ రెడ్ల చరిత్రను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ చిత్రీకరించబోతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాంగోపాల్‌వర్మపై ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప పేరుతో సినిమా తీయడం సరికాదన్నారు. బెజవాడ సినిమా మాదిరిగా కడప సినిమాలోనూ మార్పులు చేయాలని చెప్పారు. లేకపోతే కడప ప్రజలు రాంగోపాల్‌వర్మకు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
