మహిళా లోకాన్ని దారుణంగా మోసం చేశారని ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమిటీ? అడ్వర్‌టైజ్‌మెంట్లు ఏమిటి? మహిళల రుణాలు మాఫీ చేస్తానన్నారు.. కానీ మాఫీ చేయకపోవడం మాత్రమే కాక కొత్త రుణాలు ఇవ్వడం మానేశారు. పొదుపు సంఘాల
తరుపున బ్యాంకులకు కట్టాల్సిన డబ్బు కట్టడం లేదు. ఎన్నికలు అయిన వెంటనే చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానన్నారు.. చేశారా? అని చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు.
అంతేగాక…
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అధికార టీడీపీ పార్టీ నాయకులు రాక్షసంగా వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను వివస్త్రను చేసి దుశ్శాసన పర్వానికి తెరతీశారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూమిని ‘ఎన్టీఆర్ గృహకల్ప’ పేరుతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకోవడమే ఆ మహిళ చేసిన తప్పు. తమ కబ్జాకాండను అడ్డుకున్నారన్న నెపంతో మహిళ అని చూడకుండా దుస్తులు చింపేసి ఈడ్చేశారు. బండ బూతులు తిడుతూ ఇతర దళితులను వెంటాడి కొట్టారు. ఈ ఘటనపై బాధితులు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ..నిందితులంతా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులు కావడంతో కేసు నమోదుకు పోలీసులు వెనుకాడుతున్నారు. నడిరోడ్డుపై ఒక దళిత అమ్మాయిని బట్టలు ఇప్పి కొడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేయాలో అది చేయకుండా తప్పుచేసిన వారిని వెనకేసుకొస్తున్నారు. మీకు 2019 లో ఒక్క దలిత మహిళ అయిన ఓటు ఏలా వేస్తారు అని జగన్ అన్నారు.