మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.. హైకోర్టు విభజన కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు ఇవాళ లోక్‌సభలో గళమెత్తిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో లోక్ సభ అనంతరం ఎంపీ కవిత మీడియా తో మాట్లాడారు..కేంద్రప్రభుత్వం చొరవ చూపి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో రాష్ర్టాల విభజన జరిగినప్పుడు హైకోర్టు ఏర్పాటులో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. కేంద్రం కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన చేయాలన్న కవిత.. ప్రకటన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గతంలో ఏపీ స్థలం ఇవ్వలేదని, భవనాలు లేవని సాకులు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుపై నెట్టడం సరికాదన్నారు .