లోక్ సభ మొత్తం దద్దరిల్లేల హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ లోక్ సభలో గళమెత్తారు. హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ఎంపీలు.. స్పష్టమైన ప్రకటన కోసం డిమాండ్ చేశారు. హైకోర్టును తక్షణమే విభజించాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. వి వాంట్ హైకోర్టు అంటూ టీఆర్ఎస్ ఎంపీలు నినదిస్తూ.. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు.హైకోర్టు విభజనపై టీఆర్ఎస్ ఎంపీలు పట్టువిడవకపోవడంతో లోక్సభ రెండుసార్లు వాయిదా పడింది. విభజన చట్టంలోని హామీల అమలు కోసం పోరాడుతామని ఎంపీలు స్పష్టం చేశారు. హైకోర్టు విభజనపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ పోరాటం ఆగదని టీఆర్ఎస్ ఎంపీలు తేల్చిచెప్పారు.