ఏపీలో కర్నూలు స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ పోటిచేస్తున్నసంగతి తెల్సిందే .అయితే గతంలో స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే .
తాజాగా వైసీపీ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది .ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది .కేఈ ప్రభాకర్ సమర్పించిన నామినేషన్ పత్రాలల్లో వెల్లడించిన వివరాల ప్రకారం ప్రభాకర్ పేరున నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయి .స్థిరాస్తులు మొత్తం పదకొండ కోట్ల యాబై మూడు లక్షల రూపాయలుగా ..అంతే కాకుండా నిర్మాణం ,అభివృద్ధి దశలో ఉన్న పలు ఆస్తుల విలువ మొత్తం నాలుగు కోట్ల నలబై ఒక్క లక్షలుగా ఆయన చూపించారు .