ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కదిరి నియోజక వర్గంలో చేస్తున్నారు .పాదయాత్రలో భాగంగా జగన్ కు ఎవరు ఊహించని విధంగా ఒక యువతి ప్రశ్నల వర్షం కురిపించింది .అయితే యావత్తు నియోజకవర్గమే కాకుండా ఏకంగా రాష్ట్ర ప్రజానీకం ఫిదా అయ్యేవిధంగా యువతి సంధించిన ప్రశ్నకు జగన్ సమాధానమిచ్చారు .
జగన్ పాదయాత్రలో భాగంగా కదిరి నియోజక వర్గంలో ధనియాని చెరువు గ్రామంలో మహిళలతో ముఖ ముఖి సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ఒక యువతి అన్న మాకులం ఓసీ .అన్ని పథకాలు ఎస్సీ ,ఎస్టీ ,బీసీ సామాజిక వర్గాల వారికే ప్రకటిస్తున్నారు .అన్న మాకులం చేసిన తప్పు ఏమిటి అన్న …మేము ఏమి చేశాం అన్న అని యువతి ఎటువంటి బెదురూ లేకుండా ప్రశ్నల వర్షం కురిపించింది .
దీనికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ అమ్మ పథకాలు రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల్లోని వెనకబడిన వారి కోసం ,కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నవారికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయి .అప్పట్లో మహానేత వైఎస్సార్ హయంలో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు జరిగాయో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నలుమూలల ఉన్న ప్రతిఒక్కరికి అందుతాయి .ఊరికో గ్రామసచివాలయం నిర్మిస్తాం .మీరే స్వయంగా వెళ్లి ప్రభుత్వం అందించే పథకాలకు అప్లై చేసుకొని లబ్ది పొందవచ్చు అని చెప్పడంతో అక్కడ ఉన్న వారు జై జగన్ ..కాబోయే సీఎం జగన్ అని నినాదాల హోరు ఎత్తించారు .