భారత ప్రధమ పౌరుడు ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ నగరంలోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు .
ఈ క్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం చాలా బాగుంది .రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని ,అడవులను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం భేష్ .అంతే కాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో అర్భన్ లంగ్స్ స్పేస్ నిర్ణయాలను కూడా తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిన విషయం అని ఆయన తెలిపారు ..