చంద్రబాబు నయా పాటిలిక్స్.. కేఈ ఫ్యా మిలీకి భారీ షాక్.. అవును మీరు చదివింది నిజమే. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ఫ్యామిలీని రాజకీయంగా దూరం చేసే పనిలో మునిగితేలుతున్నారు. ఇందుకు నిదర్శనం కేఈ ఫ్యామిలీపై చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో చూపుతున్న ఇంట్రస్టే. చాపకింద నీరులా సాగుతున్న చంద్రబాబు వ్యవహారం కర్నూలు జిల్లాలో కేఈ ఫ్యామిలీకి భారీ షాక్ ఇవ్వనుంది.
వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో రాజకీయంగా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలన్న కేఈ కుటుంబానికి చంద్రబాబు గండికొట్టారు. అయితే, చంద్రబాబు నాయుడు నోట కేఈ ఫ్యామిలీపై పలికిన మాటలను గమనిస్తే.. వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ఎంపీ సీటుతోపాటు.. ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తామని చంద్రబాబు నాయుడు కేఈ ఫ్యామిలీకి గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
నాడు కేఈ కుటుంబానికి ఇచ్చిన హామీపై పునరాలోచనలో పడ్డ చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అందివచ్చిన అవకాశంగా దొరికింది. అయితే, టీడీపీలో ఎవరికైనా, ఏ ఎన్నిక అయినా అభ్యర్థుల ఎంపికలో నాన్చి నాన్చి లీకులు ఇచ్చి చివరకు టికెట్ ఇవ్వాలనే ఆలోచించి.. లీకులిచ్చిన తరువాత అభ్యర్థిని ఎంపిక చేసే చంద్రబాబు.. కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక మాత్ర ఆలోచించకుండా కేఈ ప్రభాకర్ పేరును తెరపైకి తెచ్చారు చంద్రబాబు. అయితే, కేఈ ప్రభాకర్‌రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించిన విషయం విధితే.
అయితే, ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో పలు పార్టీల నేతలను, నాయకులను డబ్బు మూటల ఆకర్షతో టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ భారీ వలసలే నేడు చంద్రబాబు మైండ్ గేమ్‌కు మరో సారి తెరతీసింది. వలసల పర్వాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు కేఈ ఫ్యామిలీ టికెట్ల విషయంల కోత విధించాలని నిర్ణయించుకున్నారు.
అసలు విషయానికొస్తే.. 2019 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి రాజకీయ రిటైర్‌మెంట్, ఎంపీ టికెట్ ఆశించిన కేఈ ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ టికెట్‌తో, అలాగే 2019 ఎన్నికల్లో డోన్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కేఈ కృష్ణమూర్తి కుమారుడికి హత్య కేసుతో చెక్ కర్నూలు జిల్లా రాజకీయాల్లో కేఈ ఫ్యామిలీ రాజకీయ అడ్రస్ గల్లంతయ్యేలా ఉంది.