ఏపీ లో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే .గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ అయిన శిల్ప చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరారు .దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది .
ఈ నేపథ్యంలో అధికార పార్టీ అయిన టీడీపీ ఎమ్మెల్సీ స్థానికి అభ్యర్ధిగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు అయిన కేఈ ప్రభాకర్ పేరును ఖరారు చేసినట్లు తెలుగు తమ్ముళ్ళ గుసగుసలు .అయితే గత మూడున్నర ఏండ్లుగా ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో టీడీపీ కొన్ని వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి గెలిచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందనే నెపంతో వైసీపీ పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన నేత ఒకరు సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఆ పార్టీకి చెందిన నేత గౌరు వెంకటరెడ్డి పోటిలో నిలబడతాను ..అవసరమైతే స్వతంత్ర అభ్యర్ధిగా అయిన సరే పోటిలో నిలబడతాను అని ఆయన తెలిపారు .
కర్నూలు స్థానిక సంస్థల పరిధిలో మొత్తం ఒక వెయ్యి ఎనబై మంది స్థానిక సంస్థల ప్రతినిధుల బలం ఉంది .వీటిలో వైసీపీ పార్టీకి చెందినవారే ఎక్కువగా ఉన్నారు .వారు ఈ సారి మనకే ఓటు వేస్తారు .పోరాడి గెలిచి రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ సత్తా ఏమిటో అధికార టీడీపీ పార్టీకి రుచి చూపిస్తాను .మీరు అనుమతిస్తే తప్పకుండ పోటి చేస్తాను .పోరాడితే పోయేది ఏమి లేదు అవినీతి అక్రమ రాజకీయాల అంతం అని మీరే సూచించారు .ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఈ ఉప ఎన్నికల్లో పోటి చేయాలనీ వెంకటరెడ్డి జగన్ తో అన్నట్లు సమాచారం .చూడాలి మరి నీతి వంతమైన రాజకీయాలు కావాలని ఆరాటపడే జగన్ ఎంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో ..?.