గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఇవాళ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే . కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రానిల్ రాజ్‌గురుపై 21వేల పైచిలుకు ఓట్ల తేడాతో రూపానీ విజయం సాధించారు. రూపానీకి 52,155 ఓట్లు రాగా, రాజ్‌గురుకు 29,938 ఓట్లు వచ్చాయి.
ఈ సందర్బంగా అయన గురించి మీకు తెలియని 10 విషయాలు
- 1956, ఆగస్టు 2న మయన్మార్‌లోని యంగాన్‌లో విజయ్ రూపానీ జన్మించారు.
- బీజేపీ గుజరాత్ యూనిట్ జనరల్ సెక్రటరీగా నాలుగుసార్లు పని చేశారు.
- 1976లో ఎమర్జెన్సీ సందర్భంగా జైలు జీవితం గడిపారు.
- 1987లో రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
- 1996లో రాజ్‌కోట్ మేయర్‌గా, 1998లో బీజేపీ గుజరాత్ యూనిట్ జనరల్ సెక్రటరీగా సేవలందించారు.
- 2006లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
- 2013లో గుజరాత్ మున్సిపల్ ఫైనాన్స్ బోర్డుకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
- 2014లో ఆనందీ బెన్ పటేల్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు.
- 2016లో గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా సేవలందించారు.
- 2016లో గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ బాధ్యతలు స్వీకరించారు. మళ్లీ ఇప్పుడు రెండోసారి గుజరాత్ సీఎంగా రూపానీ ప్రమాణస్వీకారం చేశారు.