గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకొని ఆరోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూపానీతో పాటు 19 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరింస్తున్నారు. గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటి ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ , కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, అనంత్ కుమార్, గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్, గోవా సీఎం మనోహర్ పారికర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సింథియా, బీహార్ సీఎం నితీష్ కుమార్, చత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏపీ తరఫున ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.