ఉదయభాను. తెలుగు వెండి తెర ప్రేక్షకులతోపాటు.. బుల్లితెర ప్రేక్షకులకూ పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై యాంకర్‌గాను.. జడ్జిమెంట్ ఇస్తూ.. మరో పక్క వెండితెరపై సైతం నటించింది ఉదయభాను. చలాకిదనం, గలగల మాట్లాడటం ఆమె సొంతం. అయితే, ఆమె సెలబ్రిటీ స్థానానికి చేరడానికి ముందు ఎన్నో ఎత్తు పల్లాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ఈ విషయంపై తాను ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ.. ఆ బాధలన్నీ తన వైవాహిక జీవితంతో మరిచిపోయానని, ప్రస్తుతం మాతృత్వ మధురానుభూతిని పొందుతున్నానని తెలిపింది. జీవితంలో ఎన్నో రకాలుగా నష్టపోయినా.. తన భర్త విషయంలో తనంత దృష్టవంతురాలు మరెవరూ ఉండరంటూ చెప్పుకొచ్చింది. ప్రపంచమంతా తనవైపు వేలెత్తి చూపినా.. తన భర్త మాత్రం.. తనవెన్నంటే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమైంది.
ఇక ఉదయభాను భర్త మాట్లాడుతూ.. తమ స్వస్థలం విజయవాడ అని, ఓ ఈవెంట్ చేయడానికి ఉదయభాను విజయవాడకు వచ్చిన సమయంలో తాను ఉదయభాను చూశానని తెలిపింది. ఆ తరువాత తామిద్దరం మాట్లాడుకున్న తరువాత ఆర్య సమాజ్లో వివాహం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. విషయం తమ కుటుంబ సభ్యులకు తెలిసి.. ఉదయభానును పెళ్లి చేసుకుంటానంటే మేం వద్దంటామా అంటూ తమకు షాక్ ఇచ్చారన్నారు. పెళ్లైన కొత్తల్లో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం తన కన్‌స్ర్టక్షన్ వ్యాపారం బాగా ఉందని, డబ్బు కూడా బాగానే ఉందని చెప్పుకొచ్చాడు ఉదయభాను భర్త.