Home / CRIME / ఏపీలో నడిరోడ్డుపై కొట్టుకున్న మహిళలు…ఎందుకో తెలుసా…!

ఏపీలో నడిరోడ్డుపై కొట్టుకున్న మహిళలు…ఎందుకో తెలుసా…!

విశాఖలో ఇంటి సందు, వీధి కోసం మహిళలు నడిరోడ్డుపై కొట్లాటకు దిగారు. జుత్తులు పట్టుకుని కొట్టుకోవడం కలకలం రేగింది. దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న లక్ష్మీపురం కాలనీలో ఓ స్థలం విషయంలో కొంతకాలంగా గొడవ కొనసాగుతోంది. ఈ క్రమంలో పద్మ, సత్యవతి అనే మహిళలు, పక్కంటిలో ఉండే సంతోషి అనే మహిళపై ఈ రోజు ఉద​యం దాడి చేశారు. సంతోషి భర్త శివ ఆటో డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు.

అతను ఇంట్లో లేని సమయంలో మహిళలు సంతోషి పైన దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న శివ ఇంటి వద్దకు చేరుకుని తన భార్యపై చేయి చేసుకున్న వారిని చితకబాదాడు. తన భార్య మూడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా సదరు మహిళలు కొట్టారని శివ దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటన 3 గజాల స్థలం కోసం ఈ గొడవ జరిగనట్టు ఆటో డ్రైవర్‌ తెలిపాడు. గతంలో కూడా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat