గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అటు తర్వాత టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు .ఒక ప్రముఖ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు .
మంచి మనసున్న వ్యక్తి అని తన తల్లి దండ్రులు చెబుతుండే వారు .తన తల్లి దండ్రులకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం .మా కుటుంబం అంటే కూడా పవన్ కు చాలా ఇష్టం .అసలు పవన్ కళ్యాణ్ చాలా సాధారణంగా ఉంటారు .అని తన తండ్రి దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నసమయంలో చెప్పేవారు అని ఆమె చెప్పుకుంటూ వచ్చారు.అయితే శోభానాగిరెడ్డి గారు చనిపోవడానికి ముందు ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ రావాల్సి ఉంది .అయితే భూమా నాగిరెడ్డి గారు రావద్దని పవన్ కళ్యాణ్ ను కోరడంతో రాలేదు అని ఆమె అన్నారు .