వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై అక్రమంగా మోపిన కేసులతో తెలుగుదేశం పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులోను దీనికి కారణం లేకపోలేదు. అదే.. ఇటీవల సీబీఐ కోర్టు టుజీ స్పెక్ర్టం కేసుకు సంబంధించి వెల్లడించిన తీర్పు.
ఇప్పుడు ఇదే తీర్పు అటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు… టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. అసలే టుజీ స్పెక్ర్టం కేసు కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారంం. అంత అవినీతి మయమైనది లేదంటూ నాడు దేశ ప్రజల నోట్లో నుంచి వచ్చిన మాట ఇది. అటువంటి కేసునే కొందరు నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం వాడుకున్నారని, అందులో భాగంగానే టుజీ స్పెక్ర్టం కుంభకోణం అంటూ కథలు అల్లారంటూ సాక్ష్యాత్తు సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక, ఈ కేసు విచారణలో సీబీఐపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి కూడా. ఆఖరకు టుజీస్పెక్ర్టం కేసుకు సంబంధించి 1556 పేజీల తీర్పును న్యాయమూర్తి ఇచ్చారు.
అయితే, మొన్నటి వరకు టుజీ స్పెక్ర్టం కేసుకు.. వైఎస్ జగన్‌కు ముడిపెడుతూ విమర్శలు, ఆరోపణలు గుప్పించిన టీడీపీ నేతలకు నేడు మింగుడు పడటం లేదు. టుజీ స్పెక్ర్టం కేసు దూది పింజల్లా తేలిపోవడంతో టీడీపీ కిమ్మనడం లేదు. ఇక వైఎస్ జగన్ విషయానికొస్తే.. జగన్‌పై ఉన్న కేసుల సమయంలో.. జగన్ ప్రజా ప్రతినిధి కూడా కాదు. అందులోను మంత్రులది, ప్రభుత్వాధికారులదీ తప్పు లేదు. అటువంటిది ఈ కేసు కూడా టుజీ స్పెక్ర్టం కేసులానే దూది పింజల్లా తేలిపేవడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ కేసులకు సంబంధించి సీబీఐ ఎంత త్వరగా విచారణను ముగిస్తే.. జగన్‌పై ఉన్న కేసులు అంత త్వరగా దూది పింజల్లా తేలిపోతాయని అంటున్నారు టుజీస్పెక్ర్టం.. జగన్ కేసులను పోల్చినవారు.