తెలంగాణ ఆణిముత్యం..మిమిక్రీ దిగ్గజం పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కు ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. ఆయన పోస్టల్ కవర్‌ను తపాలా శాఖ విడుదల చేయనుంది.86 ఏళ్ల నేరెళ్ల వేణుమాధవ్ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చిన వేణుమాధవ్‌కు ఎన్నో పురస్కారాలు దక్కగా కేంద్రం 2001లో పద్మశ్రీతో సత్కరించింది.
మిమిక్రీ కళలో 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గౌరవార్థం తపాలా కవర్ ను విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని తపాలాశాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగే ఈ కార్యక్రమానికి నేరెళ్ల వేణుమాధవ్ హాజరుకానున్నారు.