రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది .ఇప్పటి వరకు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో ఉత్కంఠ కొనసాగగా.. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది. ఒకరి కోసం ఒకరు వేచిచూసిన వైసీపీ, టీడీపీల్లో..కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ను అధిష్టానం ఎంపిక చేసింది అయితే, మొదట శివానందను అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆ పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు పార్టీ అధినేత వైయస్ జగన్ కలవడానికి గౌరు వెంకటరెడ్డి పాదయాత్ర దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో గౌరు వెంకటరెడ్డి.. జగన్ తో భేటీ అయి తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలుపుతానని చెప్పారు. ఒక వేళ పార్టీ అధినేత జగన్ ఈ పోటిపై వ్యతిరేకించినా పోటీ.. ఇందుకు అంగీకరించకపోయినా తాను పోటీ చేసి తీరుతానని గౌరువెంకటరెడ్డి చెప్పడం గమనార్హం. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు తనకు మద్దతుగా నిలుస్తారని గౌరువెంకటరెడ్డి భావిస్తుండటమే ఆయన వ్యాఖ్యలకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండటం గమనార్హం. టీడీపీ నుంచి టీడీపీ కేఈ ప్రభాకర్ కాగా, కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైసీపీ చివరి నిమిషంలో తప్పుకుంది. వైసీపీ నుంచి గౌరు వెంకట రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలతో పాటు నాగిరెడ్డి, రవికిశోర్ రెడ్డి పేర్లు వినిపించాయి. కానీ, టీడీపీ నుంచి శివానంద రెడ్డి పేరు రావడంతో వైసీపీ బరి నుంచి తప్పుకుందని చెబుతున్నారు. అందుకు వైసీపీ నేతతో ఆయనకు బంధుత్వమే కారణమని అంటున్నారు. అయితే, ఆ తర్వాత టీడీపీ నుంచి కేఈ ప్రభాకర్ పేరును ఖరారు చేశారు. కేఈ కూడా మొదటి నుంచి రేసులో ఉన్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకు శివానంద పేరును టీడీపీ కావాలనే వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఆ పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి తప్పకుండా పోటీ చేస్తానని చెబుతుండటంతో ఏకగ్రీవమవుతుందనుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి ఉత్కంఠకు దారితీసింది.