ప్రస్తుత ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన కింది స్థాయి నేత దగ్గర నుండి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు అందరు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ,ఆయన తండ్రి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తారు అని మనకు తెల్సిందే .ఒక్కొక్కసారి పరుష పదజాలంతో కూడా దూషిస్తారు .
అట్లాంటి టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ తరపున పోటి చేసిన నేత ప్రశంసల వర్షం కురిపించారు అంటే నమ్ముతారా. కానీ ఇదే నిజం .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో కడప ఎంపీగా 1996లో టీడీపీ తరపున పోటి చేసిన కందుల రాజమోహన్ రెడ్డి ఒక ప్రముఖ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు .ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తమకు అండగా ఉన్న పార్థసారధి వర్గీయులు వైఎస్సార్ తండ్రి అయిన రాజారెడ్డి మీద పట్టపగలు దాడి చేసి మరి హత్య చేశారు .
ఇది అందరికి తెల్సిన విషయం .కానీ మేము రాజకీయంగా ఎంత కొట్లాడుకున్న కానీ యుద్ధాలు చేస్కున్న కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు మా కుటుంబం మీద మంచి అభిమానాన్ని కల్గి ఉండేవారు .అందుకే తన తండ్రి హత్యలో తమ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్న కానీ తమపై కేసులు పెట్టవద్దు అని తన అనుచరవర్గానికి సూచించారు.శత్రువును ఆఖరికి తనకు ప్రాణహాని చేసేవాళ్ళను కూడా క్షమించే మంచి మనస్సున్నోడు వైఎస్సార్ అని ఆయన ప్రశంసలు కురిపించారు ..