ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పట్టుదలకు మారు రూపంగా మరోసారి రుజువు చేసుకున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మరింత వేగంగా పూర్తి చేయడానికి గాను అధికార యంత్రాంగం, ఏజెన్సీలను సన్నద్ధం చేయడానికి మూడు, నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోనే మకాం వేయనున్నారు.తెలంగాణ జిల్లాల్లో సుడిగాలి పర్యటన లకు పేరుపొందిన హరీశ్ రావు మరో సంచలనాన్ని నమోదు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఆయన నిరవధిక యాత్ర సాగింది.సుందిళ్ళ బ్యారేజీ సైటులోనే హరీశ్ రావు బస చేశారు.
మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన తీరు అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను నివ్వెర పరచింది.పోలీసు యంత్రాంగం దిగ్భ్రాంతికి గురయింది.సోమవారం సాయంత్రం వరకు సిద్ధిపేట లో పలు కార్యక్రమాలలో బిజీ బిజీగా గడిపిన మంత్రి రాత్రికి కాళేశ్వరం ప్యాకేజి 6,7 లను సందర్శించారు.అనంతరం అటవీ ప్రాంతంలోని సుందిళ్ళ బ్యారేజీ పనులను తనిఖీ చేశారు.నిర్ణీత కాల వ్యవధిలో పనులన్నీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను హరీశ్ రావు కోరారు. ఇరిగేషన్ అధికారులు,ప్రజాప్రతినిధులు, మీడియాకు తెలియకుండా, మంది మార్బలం లేకుండా హుటాహుటిన ఈ ప్యాకేజి లలోని సొరంగాల నిర్మాణ పనుల పురోగతి, పంపు హౌస్ పనులను పరిశీలించారు.
మంత్రి హరీష్ పై తెలంగాణ ప్రజలుకోటి ఆశలు పెట్టుకున్నారంటూ సి.ఎం. కేసీఆర్ ప్రశంసించిన కొద్ది రోజులకే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయడానికి హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారు.సుందిళ్ళ బ్యారేజీ పనులలో రోజుకు 5 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని జరుగుతున్నట్టు మంత్రి తెలిపారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రోజుకు 2 లక్షల సిమెంట్ బస్తాలు కాంక్రీటు పనులకు వాడడం దేశ చరిత్రలో ప్రప్రథమమని హరీశ్ రావు అన్నారు.మంగళవారం కాళేశ్వరం పనులపై మంత్రిఉన్నత స్థాయి సమీక్ష సమావేశంనిర్వహించనున్నారు.
కాగాకాళేశ్వరం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తూ హరీశ్ రావుపైతెలంగాణ రాష్ట్ర ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తారని తమకు నీళ్లు ఇస్తారని మంత్రి హరీష్ పై ఎంతో ఆశలు నమ్మకంతో ఉన్నారని సి.ఎం.అన్నారు.. దానికి అనుగుణంగానే ఆయన ఎంతో చురుగ్గా పని చేస్తున్నారని కేసీఆర్ పొగిడారు. ఇకపై మంత్రి హరీష్ రావు 10 రోజులకు ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్శించాలని కేసీఆర్ కోరారు.మేడి గడ్డ నుంచి మిడ్ మానేరు వరకు నీళ్లు తీసుకురావడానికి ఇప్పటికి 200 రోజులు చేతిలో ఉన్నాయని సి.ఎం. అన్నారు.ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పనులు సత్వరం పూర్తయ్యేలా చూడాలని సి.ఎం.కోరిన నేపథ్యంలోమంత్రి హరీశ్ రావు సోమవారం అర్థరాత్రికి దాటాక కూడా మెరుపు తనిఖీలు సాగించారు.తెలంగాణలోని 15 జిల్లాలకు తాగు, సాగునీరందించే కాళేశ్వరం కు పర్యావరణ అనుమతులు లభించడం తో వచ్చే జూన్ కల్లా కాళేశ్వరం నుంచి పంపులు నడిపించాలని మంత్రి కృత నిశ్చయంతో ఉన్నారు.
రాష్ట్ర సాగునీటిరంగ ముఖచిత్రంలో ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం’ రాడికల్ మార్పులు తీసుకు రానున్నందున ఈ ప్రాజెక్టు పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని సి.ఎం.సంకల్పించారు.18 .80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం,మరో 1 8 లక్షల ఎకరాలను కాళేశ్వరంఅదనంగా సాగులోకి తీసుకురానున్నది.ఈ ప్రాజెక్టుకు అన్నీ రికార్డులే.9 నెలల్లో పర్యావరణ అనుమతులు సహా కీలక అనుమతులు రావడం ఒక ఎత్తు.రికార్డు సమయంలో ఈ భారీ ప్రాజెక్టు పూర్తి కాబోతుండడం మరో ఎత్తు.పనుల్ని శరవేగంగా కొనసాగించడంతో అనుకున్న సమయంలో ప్రాజెక్టు పూర్తవుతున్నది. మాధవరెడ్డి ప్రాజెక్టును మొదలుపెట్టినపుడు ఆసియాలోనే అది అతి పెద్ద లిఫ్టు పథకం.ఇందులో ఒక్కో మోటరు 600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్నవి. ఆ తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 30 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ పథకంలో అన్ని మోటర్లను కలిపితే గరిష్ఠ డిశ్చార్జి సామర్థ్యం సుమారు నాలుగువేల క్యూసెక్కులు. కానీ కాళేశ్వరం పథకంలో రోజుకు రెండు టీఎంసీలను ఎత్తిపోసేలా మోటర్లను అమరుస్తున్నారు. గోదావరి నుంచి మేడారం, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్‌ల ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించిన తర్వాత గ్రావిటీపై జలాలు మేడారం రిజర్వాయర్‌కు వస్తాయి. మేడారం రిజర్వాయర్ నుంచి 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు మోటర్లతో నీటిని లిఫ్టు చేస్తారు. రామడుగు వరకు వచ్చిన ఆ నీటిని.. అక్కడి పంపుహౌజ్ నుంచి 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు మోటర్ల ద్వారా ఎత్తి ఎస్సారెస్పీ వరద కాల్వలో పోస్తారు. దీంతో జలాలు మిడ్‌మానేరుకు చేరుతాయి. రామడుగు వద్ద ఉన్న పంపుహౌజ్‌లో బిగించిన 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్‌కు డ్రైరన్కు సన్నాహాలు సాగుతున్నవి.
రామడుగు పంపుహౌజ్‌లో బిగించే ఒక్కో మోటర్‌ద్వారా సుమారు 3001 క్యూసెక్కుల డిశ్చార్జి ఉంటుంది. అంటే ఏడు మోటర్ల ద్వారా 21012 క్యూసెక్కులు (దాదాపు రెండు టీఎంసీలు) ఎత్తిపోయనున్నారు. ఇది ఆసియాలోనే రికార్డు. మేడారం దగ్గర పంపుహౌజ్‌లో మోటర్ బిగింపు, డ్రైరన్ పూర్తయిన తర్వాత ట్రయల్న్ (నీటిని లిఫ్టు చేయడం) కూడా చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఎల్లంపల్లి-మిడ్ మానేరు మార్గాన్ని సిద్ధం చేసుకొని.. జూన్‌లోగా మేడారం, అన్నారం, సుందిల్ల పంపుహౌజ్‌లోనూ మోటర్ల ట్రయల్న్స్ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.సి.ఎం.ఆదేశాల మేరకు ఈ ప్రతిష్టాత్మకప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలను మంత్రి హరీశ్ రావు సూచించారు.
by : Sk Zakeer