కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ పార్టీ భవిష్యత్తు ప్రధాని మంత్రి అభ్యర్ధి అయిన రాహుల్ గాంధీపై 107ఏళ్ల భామ్మ మనసుపారేసుకుంది .ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇదే నిజం .అసలు విషయానికి నూట ఏడో వసంతంలోకి అడుగుపెట్టిన భామ్మ తన పుట్టిన రోజులు ఎంతో ఘనంగా జరుపుకున్న ఆమె రాహుల్ గాంధీ అందగాడు .
అతడ్ని కలుస్తా అంటూ తన మనవరాల్ని కోరింది .పుట్టిన రోజు సందర్భంగా కేకు కట్ చేసిన భామ్మను ఆమె మనవరాలు దీపాలి సికంద్ బర్త్ డే గిఫ్ట్ గా ఏమికావాలి అని అడిగింది .దీనికి సమాధానంగా భామ్మ రాహుల్ గాంధీ అందగాడు .అతడ్ని కలవాలని ఉంది అని సిగ్గు పడింది .ఇదే విషయం గురించి దీపాలి తన ట్విట్టర్ ద్వారా తెలిపింది .
దీనికి రాహుల్ గాంధీ స్పందిస్తూ నా తరపున భామ్మను మీరే ఒక్కసారి హాగ్ చేస్కొండి అంటూ ట్విట్టర్ లో రిప్లై ఇచ్చాడు .అంతే కాకుండా ఏకంగాఆ భామ్మకు ఫోన్ చేసి మరి విషెస్ చెప్పారు కాంగ్రెస్ పార్టీ యువరాజు ..యువరాజు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది ..