ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.ఇవాళ మధ్యాహ్నం ఆయన అనంతపురానికి వెళుతూ.. కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలనుకున్నారు. దీంతో కారు ఆపాల్సిందిగా తన డ్రైవర్‌కు సూచించారు. డ్రైవర్ ఒక్కసారిగా కారు నిలపడంతో కాన్వాయ్‌లోని మరో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి దేవినేనితో పాటు మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. దేవినేని బెంగళూరు నుంచి అనంతపురానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.