ఆంధ్రప్రధేశ్ ప్రధాన ప్రతిపక్షనేత, ప్రజా సంకల్ప పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్న వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరింత అలెర్ట్ అవుతున్నారు. టీడీపీ మంత్రుల నుంచి నాయకులు, నేతలపై ఏడాదికోసారి సర్వే చేయిస్తూ.. మీ ర్యాంకు పలానా స్థానంలో ఉంది. మీ పనితీరు నాశిరకంగా ఉంది అంటూ బెదిరిస్తూ వారి అవినీతి చిట్టాను బయటకు తీయడమే కాకుండా.. వారిని గుప్పిట్లో పెట్టుకోవడమే కాకుండా.. తన ప్రత్యేక బృందంతో వారిపై నిఘాను పెంచారు చంద్రబాబు.
అయితే, తాజాగా చంద్రబాబు టీడీపీ నాయకులను, నేతలను, మంత్రులను గుప్పిట్లో పెట్టుకునేందుకు మరో అడుగు ముందుకేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తన అనుచరవర్గంతోను, ఐవీఆర్ఎస్‌తో సర్వే చేస్తున్నారు. నాయకులు, నేతలు, మంత్రుల పనితీరు ఎలా ఉంది. తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా..? లేదా..? వినతుల పట్ల స్పందించడంలో అవినీతి ఆరోపణలు వస్తుండటంతో.. ఏకంగా మంత్రులే అవినీతికి పాల్పడటంతో పార్టీకి తీరని నష్టం కలుగుతుందని చంద్రబాబు మంత్రులను హెచ్చరించినట్లు సమాచారం.
అయితే, ఇప్పటికే చంద్రబాబు సర్వేలో పలు మంత్రులపై అవినీతి ఆరోపణలు రుజువయ్యాయని, వారి మీద వేటు వేస్తారో.. లేక వాటాలు పంచేసుకుంటారో అంటూ చర్చించుకుంటున్నారు ప్రజలు. మరో వైపు జగన్ పాదయాత్రతో 2019 ఎన్నికల్లో పెను మార్పులు జరగనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న విషయం విధితమే.